187 ఏళ్ల అమృతాంజన్ బ్రిడ్జి కూల్చివేత.. ఈరోజే ఎందుకో తెలుసా..?

మహారాష్ట్రలోని చారిత్రక కట్టడాన్ని కూల్చి వేస్తున్నారు. ప్రసిద్ధ కట్టడమైన అమృతాంజన్ వంతెనను ఈరోజు కూల్చిస్తున్నారు. ముంబై – పూణేలను కలుపుతూ నిర్మించిన రోడ్డులో లోనావాలా సమీపంలోని 187 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రాత్మక వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరింది. దీంతో అధకారులు కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఇప్పటికే కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఈ లాక్‌డౌన్‌ సమయమే సరైనదని భావించిన అధికారులు ఈ రోజు కూల్చి వేసేందుకు కలిసొచ్చిన సమయంగా చెప్తున్నారు.

అయితే భారతదేశాన్ని బ్రిటీష్‌ వారు పాలిస్తున్న సమయంలో ఈ వంతెనను నిర్మించారు. ప్రస్తుతం వంతెన శిథిలావస్థకు చేరడంతో గత కొంతకాలంగా వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఆర్‌డీసీ) ఈ వంతెనను కూల్చివేసేందుకు రాయ్‌గఢ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకుంది. వంతెన కూల్చివేత సమయంలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.

కాగా నొప్పి నివారిణి అమృతాంజన్ కు సంబంధించిన ఓ అడ్వర్ టైజ్మెంట్ ఉంచిన భారీ హోర్డింగును 1970లలో ఈ వంతెనపై ఏర్పాటు చేశారు. అది అందర్నీ ఆకర్షించేది. అప్పటి నుంచీ దీనికి ‘అమృతాంజన్ బ్రిడ్జ్’ అనీ, ‘అమృతాంజన్ పాయింట్ బ్రిడ్జ్’ అనీ పేరు వచ్చింది. దాంతో అంతా అమృతాంజన్ బ్రిడ్జి అనే ఇప్పటికీ పిలుస్తుండటం విశేషం.