28 ఏళ్ల కష్టం.. జైలర్ తో బ్రేక్..!

Vinayakan
Vinayakan

జైలర్ సినిమా లో విలన్ గా నటించిన వినాయకన్ ఇప్పటి వాడు కాదు. దాదాపు 28 ఏళ్లుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్నాడు. సినిమాల్లో కనిపించే ప్రతి ఒక్కరికి బ్రేక్ వస్తుందని చెప్పడం కష్టం. దశాబ్ధాలుగా కొంతమందిని తరచు సినిమాల్లో రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం కానీ వారికి ఎలాంటి గుర్తింపు ఉండదు.

ముఖ్యంగా స్టార్ సినిమాల్లో కనిపించే కొంతమంది ఆర్టిస్ట్ లు ఎప్పటికో గానీ ఒక మంచి సినిమాతో బ్రేక్ వస్తుంది. ఏదైనా ఒక పాత్రలో అతను హైలెట్ అయితే అప్పుడు అతను ఇదివరకు నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తారు. లేటెస్ట్ గా జైలర్ సినిమాలో విలన్ గురించి కూడా అదేవిధంగా మాట్లాడుకుంటున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన జైలర్ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది.ఈ సినిమా రిలీజ్ ముందు అంతకు అపాచీ లేకపోయినా రజినీ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండటమే వాళ్ళ సినిమాను సూపర్ హిట్ చేశారు. ఈ సినిమాలో రజిని ని ఢీ కొడుతూ విలన్ గా నటించిన ఆర్టిస్ట్ కూడా ఆడియన్స్ ని మెప్పించాడు.

జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయక్ ఇప్పటి వాడు కాదు.దాదాపు 28 ఏళ్లుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్నాడు.వినాయకన్ కెరీర్ 1995లోనే మొదలైంది. కేరళకు చెందిన వినాయకన్ మాంత్రికం సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ముందు డాన్సర్ గా అవకాశాలు అందుకోవాలని చూసిన వినాయకన్ బ్లాక్ మెర్క్యురీ అనే పేరుతో ఒక గ్రూప్ ని కూడా ఏర్పరచుకున్నాడు.

వినాయకన్ కి మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం అందుకే అతన్ని బాగా అనుకరిస్తాడు. చిన్న చిన్న వేషాలతో కెరీర్ కొనసాగిస్తున్న అతనికి 2006 లో కళ్యాణ్ రామ్ అసాధ్యుడు సినిమాలో ఛాన్స్ వచ్చింది. విశాల్ పొగరు సినిమాలో కూడా శ్రియ రెడ్డి పక్కన ఆమె అనుచరుడిగా కనిపించాడు. 2016లో దుల్కర్ సల్మాన్ కమ్మట్టిపాదం సినిమాలో నటించడంతో అతనికి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది.

ఆ సినిమా నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస అవకాశాలు అందుకున్నాడు వినాయకన్. జైలర్ లో విలన్ కోసం ముందు ఓ పెద్ద స్టార్ ని అనుకున్నారట. కానీ రజిని అలా స్టార్ ని తీసుకుంటే లిమిటేషన్స్ ఉంటాయని చెప్పి వేరే ఎవరైనా చూడమని నెల్సన్ కి చెప్పగా అప్పుడు ఈ వినాయకన్ గురించి ఆలోచించారట.

ట్రైల్ షూట్ ఓకే అవడంతో రజినికి ఢీ కొట్టే ఆఫర్ పట్టేశాడు. మన ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే తప్పకుండా రావాల్సిన ఫలితం వస్తుందని వినాయకన్ కెరీర్ చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం జైలర్ సినిమా సోషల్ మీడియా డిస్కషన్స్ లో ఈ వినాయకన్ గురించి కూడా చర్చించుకోవడం గొప్ప విషయమని చెప్పొచ్చు.