జియో ఫోన్ తుఫాన్

2croce jio mobiles booked in two days

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మొన్న సాయంత్రం నుంచి మొదలైన జియో ఫోన్ బుకింగులు ఇండియన్ మొబైల్ హిస్టరీలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఏడాదికి కోటి హ్యాండ్ సెట్లు బుక్ అవుతాయని జియో అంచనా వేస్తే ఏకంగా తొలి ఏడాదే రెండుకోట్లకు మించి ఆర్డర్లు వెల్లువెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న బుకింగులు దృష్టిలో పెట్టుకుని, ఫోన్ల డెలివరీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తమను ఇంతగా ఆదరిస్తున్న యూజర్లకు థాంక్స్ చెప్పిన జియో ప్రతినిధులు.. వీలైనం త్వరగా డెలివరీ చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇందుకోసం ముందుగా బుక్ చేసుకున్నవాళ్లకు ముందుగా ఫోన్ అనే విధానం ఫాలో అవుతున్నారు. ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత స్పీడుగా ఫోన్ అందుతుంది. అందుకే జనం అర్థరాత్రి కూడా కంప్యూటర్ ముందు కూర్చుని ఫోన్ బుక్ చేస్తున్నారు.

అటు జియో అవుట్ లెట్లు, రీటైల్ స్టోర్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ లెక్కన ఫోన్లు చాలా స్పీడుగా తయారుచేయాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకూ జియో ఫోన్లు ఎక్కడ రెడీ అవుతున్నాయి. ఎన్ని రెడీ అయ్యాయి అనే వివరాలు చెప్పలేదు. మొదటి వారం బుకింగులు చూసి కొన్నాళ్లు బుకింగ్ నిలిపేసే ప్రమాదం ఉందనే వదంతులతో.. యూజర్లు సైట్ కు పోటెత్తుతున్నారు. కానీ పోటీ కంపెనీలు ఎయిర్ టెల్, ఐడియా కూడా తక్కువ తినలేదు. వచ్చే నెల్లో ఆకర్షణీయ పథకాలకు తుది మెరుగులు దిద్దుతున్నాయి.

మరిన్ని వార్తలు:

కలెక్టర్ కాదట దేవత

ఇద్దరు మిత్రులు ప్రత్యర్థులైనట్లే