కాకినాడ లో కామ్ గోయింగ్.

kakinada municipal corporation elections calm going

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్నికలంటే ఎంత హడావిడి ఉంటుందో చెప్పేందుకు నంద్యాల బై ఎలక్షన్ పెద్ద ఉదాహరణ. ఆ ఎన్నికతో సంబంధం లేని చాలా మంది సొంత ఖర్చులు పెట్టుకుని మరీ విహార యాత్రకి వెళ్లి వచ్చినట్టు నంద్యాల వెళ్లొచ్చారు. రాజకీయం అంటే ప్రజలకు ఎంత మోజో చెప్పేందుకు ఈ మధ్య కాలంలో కనపడిన వాస్తవం ఇది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న కాకినాడలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. హోరాహోరీ పోరు అని చెప్పుకుంటున్నారు గానీ టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య కనిపిస్తున్న తీక్షణత అక్కడి ప్రజల్లో కనిపించడం లేదు. కాకినాడలో పర్యటించిన తెలుగు బులెట్ బృందానికి కాస్త వింత విషయాలే కనిపించాయి.

కాకినాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఇటు టీడీపీ, అటు వైసీపీ పార్టీ కార్యాలయాల్లో హడావిడి అంతంత మాత్రమే. ఉన్న కొద్దిపాటి హడావిడి కూడా నాయకులదే తప్ప ప్రజలది కాదు. ఇక పార్టీ కార్యాలయాల దగ్గర చూద్దామన్నా మందు బాబుల గొడవ కనిపించడం లేదు. ఇక ఓ ప్రధాన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీ, టిఫిన్, భోజనం ఖర్చు గాక జనాన్ని పదేపదే పిలవడం కనిపించింది. ఇదే తడవుగా ఎలక్షన్ ప్రచార యాడ్స్ తెద్దామని వెళ్లిన వారికి పోటీలో నిలిచిన వాళ్ళు షాక్ ఇచ్చారు. అదేమిటంటే … మీకు ఈ యాడ్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పడే ఓటు మారదు కదా అనే సమాధానమే ఎక్కువ చోట్ల వినిపించింది. ఈ పద్ధతి చూస్తే కాకినాడలో ఎన్నిక కామ్ గోయింగ్ అని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇది ప్రజల్లో స్థబ్ధత కి అద్దం పడుతుందా లేక పరిణితికి సూచికా అనేది అర్ధం కావడం లేదు.

మరిన్ని వార్తలు:

గుర్మీత్ రామ్ రహీమ్ కు ఎందుకింత ఫాలోయింగ్?

కలెక్టర్ కాదట దేవత

ఇద్దరు మిత్రులు ప్రత్యర్థులైనట్లే