పెడన అడవుల్లో ముగ్గురు మత్స్యకారులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్ లో అటు కరోనా… ఇటు ఆర్థిక ఇబ్బందులు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా పెడన సమీపంలోని మడ అడవులలో వలలు కట్టడానికి వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. అక్కడ  చుట్టు పక్కల గ్రామాల నుంచి మొత్తం పదిహేను మంది మత్స్యకారులు అడవిలోకి వెళ్లగా.. వారిలో ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి వారిలో ఒకరు మృతి చెందినట్లు వెల్లడౌతుంది.

కాగా గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా మత్స్యకారులు తప్పిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి పూర్తి వివరాలను సేకరించారు పోలీసులు. వారిని వెతికి తెస్తామని వారి కోసం ప్రజలను బయటకు రావద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.