తలనొప్పిగా మారిన ఫెక్ కాల్స్: లాక్ డౌన్ లో డైల్ 100కి 13,34,330 కాల్స్

కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో డైల్ 100కి కాల్స్ పెరిగిపోయాయి. ఈ నెల 24వ తేదీ నుంచి 13,34,330 కాల్స్ వచ్చినట్టు పోలీసులు ప్రకటించారు. ఎమర్జెన్సీ కాల్ 82,014 కాగా కోవిడ్ సస్పెక్ట్ కాల్స్ 2,710 వచ్చినట్లు  పోలీసులు వెల్లడించారు.

అదేవిధంగా.. లాక్ డౌన్ కాల్స్ 21,758 కాగా ఇన్ఫెక్టివ్ కాల్స్ 87,665. అలాగే.. విచారణ కోసం చేసిన కాల్స్ 84,123. అయితే లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత చోరీలు, గృహహింస, రోడ్డు ప్రమాదాల కాల్స్ తగ్గినట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ పోలీసులు కానీ.. తెలంగాణ ప్రభుత్వం కానీ.. మొదటి నుంచి చెప్తున్న విషయం డైల్ హండ్రెడ్ అనేది.. కొంత ఎమర్జెన్సీ సర్వీసుల కోసం వాడాలంటూ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో సగటున దాదాపుగా 23నుంచి 28,000 కాల్స్ గతంలో వచ్చేవి. కానీ లాక్ డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి దాదాపుగా 70,000లకు పైగా ఒక్కక్క రోజుకి కాల్స్ వస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అంతేకాకుండా కరోనా రాకముందు డైల్ హండ్రెడ్ అనేది కొంత ఎమర్జెసీ సర్వీసుల కోసం ఉపయోగిస్తారు. ఎప్పుడైతే తెలంగాణ పోలీసులుగానీ.. ప్రభుత్వంగానీ.. ఎలాంటి ఎమర్జెన్సీ సర్వీసులకైనా డైల్ హండ్రెడ్ కి కాల్ చేయలని చెప్పడంతో అవి విపరీతంగా పెరిగాయి. కాగా ప్రస్తుతం కరోనా మొదలైన 21వ తేదీ నుంచి దాదాపుగా 13,34,330 కాల్స్ వాచ్చాయని పోలీసులు స్పష్టం చేశారు.