దీన్ని అరాచకం అనాలా ? ఇంకేమైనా !

34 minors raped in Bihar shelter home

బీహార్…నేరాలకు నేరస్థులకు ఈ రాష్ట్రము అడ్డా అని విన్నాం కానీ సంఘటన వింటే ఎంతటి కఠినాత్ములకయినా ఒక్కసారి అయ్యో పాపం అనిపించక మానదు. బిహార్‌లోని ఓ వసతి గృహంలో ఉంటున్న దాదాపు 29 మంది బాలికలపై అత్యాచారం జరిగిందని అందుకుంసహకరించని ఒక బాలికని కొట్టి చంపేసి ఆ వసతి గృహంలోనే పాతి పెట్టారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ అకృత్యాల మీద ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తో తీగ లాగితే డొంకంతా కదిలింది. వైద్యులు మరికొంతమంది బాలికలకు వైద్య పరీక్షలు చేయగా మరో ఐదురుగు కూడా అత్యాచారానికి గురైనట్లు తేలింది. మొత్తం 40 మంది బాలికలు ఉండగా.. వారిలో 34 మంది అత్యాచారానికి గురయ్యారని తేలింది.

దీంతో బిహార్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రతినిధులు బాధిత చిన్నారులను కలుసుకున్నారు. ‘వసతి గృహ సిబ్బంది చిన్నారులను దారుణంగా కొట్టి, వాళ్లు అరవకుండా ఉండేందుకు డ్రగ్స్‌ ఇచ్చే వారనివాళ్లకు కనీసం తిండి కూడా పెట్టకుండా ఇష్టానుసారంగా కొట్టి హింసించే వారని సిబ్బందిని ఎదిరించి ఎవరైనా మాట్లాడితే వాళ్ల దుస్తులు విప్పించి కొట్టడం, సిగరెట్లతో శరీరమంతా కాల్చడం చేసే వారని తేలిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మ్‌పర్సన్‌ దిల్మని మిశ్రా తెలిపారు. తమను దారుణంగా హింసించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు చెప్పుకొచ్చారు.