చి.ల.సౌ: ట్రైలర్ రివ్యూ

Chi La Sow Official Trailer Released

అక్కినేని హీరో సుశాంత్, హీరోయిన్ రుహాని తాజా చిత్రం చి.ల.సౌ. ఇప్పటికే విడుదలైన ప్రమోస్ తో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను అక్కినేని నాగార్జున ఈరోజు విడుదల చేశాడు. ఈ ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ ను డైరెక్టర్ రాహల్ రవీంద్రన్ క్లారిటీ గా చెప్పాడు.

హీరో సుశాంత్ ను వాళ్ళ అమ్మ, ఫ్రెండ్స్ అందరు పెళ్లి పెళ్లి అని వేధిస్తుంటారు. ఇక ఇలాంటి వాళ్ళ మధ్యలో తిప్పలు పడే పెళ్ళీడుకొచ్చిన యువకుడిగా సుశాంత్ రోల్ సహజంగా ఉంది. హీరోయిన్ రుహాని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. అందరి అమ్మాయిల లాగే ఈ అమ్మాయి కూడా హీరో ని పెళ్లి చూపులు లోనే ప్రేమించి, హీరో అంటే ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తుంది.

‘మేమేమైనా వాషింగ్ మిషన్లమా ఫీచర్స్ చూసి కొనడానికి?’ హీరోయిన్ చెప్పే డైలాగ్…  ‘హైదరాబాద్ లో రెండు రకాల అమ్మాయిలుంటారు. ఐదర్ సింగల్ ఆర్ ఇంట్రెస్టింగ్… నెవర్ బోత్’… హీరో సుశాంత్ చెప్పే డైలాగ్. ఈ రెండు డైలాగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం అన్నపూర్ణ బ్యానర్ లో రావటం వలన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మొత్తానికి సుశాంత్ ఈ చిత్రం ద్వారా హిట్ కొట్టేయవచ్చు. ‘చి ల సౌ’ ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది.