సాయంత్రం 6గంటల సమయంలో సెప్టెంబర్ 30న నలుగురు ప్రయాణికులు బెంగళూరులోని ఓ మెట్రో స్టేషన్‌లో ఆటోమెటిక్ ఫేర్ కలేక్షన్ గేటు దగ్గరకి రాగానే కొంచెం దూరంలో ఫాల్స్ సీలింగ్ నుండి రెండు ప్యానల్‌లు ఉడిపడ్డ సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈమధ్యే హైదరాబాద్‌లోని అమీర్పేట్ మెట్రోస్టేషన్‌లో పిల్లర్ పెచ్చు ఊడిపోయి ఓ వివాహిత మరణించిoది. బెంగళూరులోని “నమ్మా మెట్రోస్‌నేషనల్ కాలేజీ”దగ్గరి మెట్రోస్టేషన్‌లో మరో ఘటన జరిగింది.
ఎతైన గోడలకు ప్లాస్టింగ్ చేయకపోవడం వల్లే ఇంకా వర్ష ప్రభావం వల్ల జరిగి ఉండచని, గోడలకు ప్లాస్టింగ్ చేస్తే ఈ సమస్యలు రావని బెంగళూరుమెట్రోరైలు కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్‌సేత్ పేర్కొన్నారు.
గోడలనుంచి స్లాబ్‌లు పడిపోయిన ఘటనలు బయపెడుతున్నాయని ప్రయాణికులు ఆందోళన చెందారు. రైలు కదిలేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్‌కి ఇటుకలు వదులైపడిపోతున్నాయని చెప్తున్నారు.