Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పునర్జన్మలు ఉన్నాయా లేవా అన్న సబ్జెక్టు మొదలెడితే ఇప్పట్లో తెగేది కాదు. రెండు వైపులా వాదనలు ఉంటాయి తప్ప సాక్ష్యాలు, ఆధారాలు ఎక్కడా దొరకవు కదా! కానీ తాజాగా హర్యానాలో జరిగిన ఓ పిల్లవాడి ఎపిసోడ్ చూస్తే పునర్జన్మలు నమ్మాల్సివస్తుంది.
జీన్ద్ ప్రాంతానికి చెందిన జలాల్ పురాకాలా అనే గ్రామంలోని ఓ దంపతులకి నాలుగేళ్ల కిందట ఓ అబ్బాయి పుట్టాడు. అతనికి లవిష్ అని పేరు పెట్టారు. అయితే ఆ పిల్లవాడుకి మాటలు వచ్చే కొద్దీ తరచూ రామ్ రా అని అంటుండే వాడు. పైగా ఎన్ని సార్లు చెప్పి చూసినా ఆ పిల్లవాడు తల్లి పేరు కమల అని చెప్పేవాడు. కానీ అది అతని తల్లి పేరు కాదు. పైగా రామ్ రా అని తరచూ ఆ పిల్లవాడు పలికే పేరుతో ఆ దగ్గరలో ఇంకో వూరు వుంది. దీంతో సరే పిల్లవాడు పదేపదే కలవరిస్తున్నాడు కాబట్టి అతన్ని ఆ వూరు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు ఆ తల్లిదండ్రులు. రామ్ రా కి దగ్గరయ్యే కొద్దీ నాలుగేళ్ల పిల్లవాడే పెద్దలకు దారి చూపడం మొదలెట్టాడు. పైగా బాగా తెలిసినట్టు ఓ దారి గుండా పొలంలోకి తీసుకెళ్లి అక్కడే తాను కిందటి జన్మలో కరెంటు షాక్ తో చనిపోయినట్టు చెప్పాడు.
దీంతో ఆశ్చర్యపోయిన లవిష్ తల్లిదండ్రులు ఆ ఊరిలో విచారించారు. లవిష్ తీసుకెళ్లిన పొలంలో 14 ఏళ్ల కిందట తమ కొడుకు కరెంటు షాక్ కొట్టి చనిపోయినట్టు కమల అనే మహిళ తన భర్తతో కలిసి నిర్దారించింది. దీంతో రెండు కుటుంబాల వాళ్ళు లవిష్ లో కొడుకుని చూసుకుంటున్నారు. ఈ వార్త తెలిసినప్పటినుంచి చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి లవిష్ ని చూసి పోతున్నారు. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా లవిష్ పునర్జన్మ గురించే చర్చ సాగుతోంది.
మరిన్ని వార్తలు