40% క్రిమినల్ కేసులు సిట్టింగ్ ఎంపీలవే.. తెలంగాణ,ఏపీలో ఎంత మంది ఉన్నారంటే.?

40% of the criminal cases are sitting MPs.. How many people are there in Telangana and AP?
40% of the criminal cases are sitting MPs.. How many people are there in Telangana and AP?

రాజ్యసభ,లోక్​సభ లోని సిట్టింగ్‌ ఎంపీల్లో 40 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ సంస్థ నివేదిక వెల్లడించింది. అందులో 25 శాతం మందిపై హత్య, కిడ్నాప్‌, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఏడీఆర్ నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థతో కలిసి సిట్టింగ్‌ ఎంపీల అఫిడవిట్‌లను పరిశీలించిన ఈ వివరాలు వెల్లడించింది​.

పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి మొత్తం 776 ఎంపీలకు గానూ 763 మంది ఎంపీలు, ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి నివేదికను రూపొందించింది. కొన్ని స్థానాలు ఖాళీగా ఉండడం, అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వలన కొన్నింటిని పక్కనపెట్టింది. మొత్తం 763 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 306 మంది (40 శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని వెల్లడించింది. అందులో 194 మంది (25 శాతం)పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని చెప్పింది. తెలంగాణలోని 24 మంది ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్‌ కేసులు ఉండగా.. అందులో 9 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది.