అమెరికా దేశ బిజినెస్‌స్కూల్స్ ఇమ్మిగ్రేషన్ విధానంద్వారా మంచి నైపుణ్యంగల విదేశీ వర్కర్స్ ని దేశంలోకి అనుమతించాలని కోరారు ట్రంప్‌ను దేశ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని సమీక్షించాలని 50 బిజినెస్ స్కూళ్ల డీన్స్ ఒక బహిరంగలేఖ ద్వారా కోరారు.స్టాన్‌ఫోర్డ్, డ్యూక్, న్యూయార్క్, యేల్,కొ లంబియా లాంటి ప్రఖ్యాత వర్సిటీల అధిపతులు రాసి సంతకం చేసిన లేఖను వాల్‌స్ట్రీట్ జనరల్ బుధవారం ప్రచురించింది.
స్కిల్డ్ వర్కర్స్ ప్రోత్సహించేందుకు “హార్ట్ ల్యాండ్ వీసా” అమల్లోకి తీసుకురాలని ఈ లేఖలో కోరారు.తాము చేపట్టిన విశ్లేషణలో యూనివర్సిటీల్లో, బిజినెస్ స్కూళ్లలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య గత మూడుసంవత్సరాలలో తగ్గిందని డీన్స్ తెలపారు.ప్రతిభను,నైపుణ్యాన్ని గుర్తించి ఇమ్మిగ్రేషన్‌పై విధిస్తున్న పరిమితులు మార్చాలంటూ పేర్కొన్నారు.
విధించిన పరిమితుల కారణంగా హెచ్-1 బీ వీసాలు అమెరికా లో తగ్గాయని 2015లో 6శాతం వీసాల తిరస్కరణ,2019 లో ఏకంగా 32 శాతానికి హెచ్-1 బీ వీసాల తిరస్కరణ జరిగిందని డీన్స్ వెల్లడించారు. రెండులక్షల 36వేల హెచ్1బీ వీసా దరఖాస్తులు 2017లో రాగా 2018కి అవి లక్షా 99వేల వీసాదరఖాస్తులు వచ్చాయని హెచ్1బీ వీసాల కోసం వస్తున్న దరఖాస్తులు తగ్గిపోయాయని తెలిపారు.