ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతుంది. ఒక్కమంగళవారం ఒక్క రోజే 21 కేసులు నమోదు కావడంతో.. బాధితుల సంఖ్య రాష్ట్రంలో 58కి చేరింది. ప్రస్తుతానికి ఏపీలో నమోదైన మొత్తం కేసుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో 14, ప్రకాశంలో 13, విశాఖలో 10, గుంటూరులో 9 కేసులు, కృష్ణాలో 5, తూ.గో జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కోటి ఉన్నాయి. ఏపీలో నిన్న 256 మంది నమూనాలను పరీక్షించగా.. వాటిలో 21 పాజిటివ్, 235 నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని వైద్యశాఖ వెల్లడించింది.
కాగా ఇప్పటివరకు కరోనా నుంచి ఇద్దరు కోలుకున్నారు. అయితే నిన్నటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని పశ్చిమ గోదావరి జిల్లాలో….. ఒకే రోజు 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏలూరులో 8మంది, భీమవరంలో ఇద్దరు, ఉండి , గుండుగోలను, నారాయణపురం, పెనుగొండల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా భారిన పడ్డారు. వీరంతా ఢిల్లీలో జరిగిన జమైతా ఇస్లామిక్ సభలకు వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు.