వర్మ నువ్వు ఆపు బాబు అంటున్న నెటిజన్లు

వర్మ నువ్వు ఆపు బాబు అంటున్న నెటిజన్లు

ప్రపంచంలో ఎక్కడ ఏమూల చిన్న ఇష్యూ జరిగిన దానిపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలిచే వర్మ.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో మొదటి నుంచి కూడా తన మార్క్ ట్వీట్లతో వైరల్ అవుతున్నారు. కరోనాపై వర్మ చేసిన ట్వీట్లు ఆలోచింపచేసే విధంగా.. మరికొన్ని ఫన్నీగా.. ఇంకొన్ని కొన్ని వర్గాలలకు ఎప్పటిలాగే మంట పుట్టించే విధంగా ఉన్నారు.

తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. కరోనాపై పాటరాసి ఎవడితోనే ఎందుకు నేనే పాడేస్తే పోలా అనుకున్నాడో ఏమో కాని తన గొంతుకు పనిచెప్పి ఈ పాట ప్రోమో వదిలాడు. పూర్తి పాట వినడానికి సాయంత్రం వరకూ టైం ఉందిలే కాని.. ఈలోపు ఈ ప్రోమో వదులుతున్నా.. ఇది కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన “కనిపించని పురుగు” అనే పాట ప్రోమో..చెవులకు మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం (ఏప్రిల్ 01) సాయంత్రం 5.30 కి స్ప్రే చేయబోతున్నాను’ అంటూ సోమవారం అర్థరాత్రి ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ పెట్టాడు వర్మ. ఇక వర్మ అర్థరాత్రి పూట పెట్టిన పోస్ట్‌లు ఎలాగు ఉంటాయో ఆయన్ని ఫాలో అయ్యేవాళ్లకు దాదాపు ఓ క్లారిటీ ఉంటుందిలే కాని.. తాజాగా వర్మ కరోనాపై పాడిన “కనిపించని పురుగు” పాట చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేట్టుగానే ఉంది.