ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్ 19) ఎంత ప్రకపంపనలు రేపుతోంది ప్రతీ రోజు మనం వింటూనే ఉన్నాం.జస్ట్ నిన్ననే ఈ వైరస్ సోకిన రెండో అతి పెద్ద దేశం అయినటువంటి ఇటలీలో కేవలం 24 గంటల్లో 600కు పైగా మృత్యువాత పడ్డారు.ఇది పెద్ద సెన్సేషన్ అయ్యింది.అయితే మన దేశంలో పెద్దగా కేసులు నమోదు కాలేదు.
అయినవి కూడా పాజిటివ్ ఒక్కటే వచ్చినట్టు తెలిపారు.అది కూడా స్టడీ గానే ఉందని ప్రమాదం ఏమి లేదని నిపుణులు చెప్పారు.అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అరకొరగానే నమోదు అయ్యాయి మొదట తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదు అయ్యింది.కానీ ఏపీలో కూడా వచ్చినట్టు కొన్ని వదంతులు వచ్చాయి కానీ కన్ఫర్మ్ కాలేదు.
కానీ ఇప్పుడు దిమ్మతిరిగిపోయే వార్త అందులోను ఒక టాప్ జిల్లా వాసులను వణికిస్తోంది.విదేశాల నుంచి వచ్చిన ఒక 8467 మంది భారతీయులను విశాఖ జిల్లా ఎయిర్ పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా స్క్రీనింగ్ చెయ్యగా వారిలో ఏకంగా 64 మందికి ఈ కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ అయ్యిందట. ప్రస్తుతానికి వీరిని అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలుస్తుంది.ఒక్కసారిగా 64 మందికి అంటే అది చాలా ఎక్కువే అని చెప్పాలి.ఇక నుంచి అయినా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అశ్రద్ధ మానుకొని పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.