పాకిస్తాన్లో జరిగిన రైలు అగ్ని ప్రమాదంలో 30మంది గాయపడగా 65 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన లియాకత్పూర్ నగర సమీపంలో జరిగినది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న తేజ్గామ్ రైలు లియాకత్ పూర్ దగ్గరకి రాగానే అగ్ని ప్రమాదం జరిగినది. చెలరేగిన మంటల వల్ల పూర్తిగా మూడు బోగీలు పూర్తిగా దాహణమయ్యాయి.
వెంటనే అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీస్కురావడానికి ప్రయత్నించగా ఆర్మీ సిబ్బంది కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. గాయడిన క్షతగాత్రులను, మృతదేహాలను అధికారులు దగ్గరలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఈ ప్రమాదం ప్రయాణికులలో కొందరు ఆహారం వండుకోవడానికి గ్యాస్ వెలిగించడం వల్లే సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. రెండుస్టవ్లు పెద్దశబ్ధంతో టిఫిన్ తయారీ కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో పేలిపోవడం వల్ల వంటకు ఉపయోగించే నూనెకు మంటలు అంటుకోవడంతో ఇలా జరిగినది. మంటలకి భయపడిన ప్రయాణీకులు ట్రైన్ నుంచి బయటికి దూకేసిన వారే ఎక్కువగా ఉన్నారని అధికారులు అన్నారు