తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కి తిరుమల లో ఘోరమైన చేదు అనుభవం ఎదురైంది.. కాగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని, తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లినటువంటి మంత్రి హరీష్ రావు కి తిరుమల్లో ఘోరమైన అవమానం ఎదురైందని చెప్పాలి… కాగా ఒక రాష్ట్రానికి మంత్రిగా సేవలందిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ విషయంలో సదరు టీటీడీ అధికారులు దారుణంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి హరీష్ రావు స్వామి దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్, అక్కడికి చేరుకొని మంత్రి హరీష్ ని సముదాయించే ప్రయత్నం చేశారు. కాగా రద్దీ, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా, మంత్రి రాకపై సరైన సమాచారం లేనందువల్లే ఈ తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చారు. తరువాత కొద్దీ సేపటికి మంత్రి హరీశ్ రావును దగ్గరుండి స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. జరిగిన తప్పుకు మంత్రి హరీష్ రావు కి సదరు అధికారులు క్షమాపణలు చెప్పుకున్నారు.