నెల్లూరు జిల్లాలో ఒక నేత పెద్దమనిషి లాగా ముసుగేసుకుని తిరుగుతున్నారు. త్వరలో ఆయన కూడా లోపలికి వెళ్తారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆధారాలతోనే సిఐడి ఆయన అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో జరిగిన స్కాం లు ఒక్కోటి బయటకు వస్తున్నాయని, ఆయనకు 23 నెంబర్ కలిసి వస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడని, గత ఎన్నికల్లో ఆయనకు 23 సీట్లు వచ్చాయి…జైలుకు వెళ్లిన తేదీ కూడా 23 అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చరకలు అంటించారు. చంద్రబాబు అరెస్టుపై టిడిపి నేతల సైలెంట్ గా ఉంటే వైసీపీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువగా ఉందంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మునిగిపోయే పడవలో కూర్చున్న ఆ నేతలు ఎక్కువ రోజులు రాజకీయం చేయలేరని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చురకలు అంటించారు.