రేపటి నుంచే పునః ప్రారంభంకానున్న నారా లోకేష్‌ పాదయాత్ర

Nara Lokesh shed tears over Chandrababu's arrest
Nara Lokesh shed tears over Chandrababu's arrest

రేపటి నుంచే నారా లోకేష్‌ పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. రేపటి నుంచి నారా లోకేష్ పాదయాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రారంభం అవుతుంది. ఈ మేరకు నారా లోకేష్ పాదయాత్ర కు సర్వం సిద్ధం చేస్తున్నారు. రేపు రాత్రి 8.15 గంటలకు నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభం కానుంది.

ఈ నెల 8న రాజోలు నియోజకవర్గంలో నారా లోకేష్‌ పాదయాత్ర ఆగింది . చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ నెల 9న పాదయాత్ర సైట్ నుంచి విజయవాడ వెళ్లిన నారా లోకేష్…తన పాదయాత్రను అర్ధాంతరంగా ఆపేశారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఇక 20 రోజుల తర్వాత నారా లోకేష్‌ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ పార్టీ కార్యకర్తలు. కాగా.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌,ఇవాళ ఏపీకి రానున్నారని సమాచారం.