ఆదివారం రోజున గోదావరి నదిలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలోని కచులురుమందం ప్రాంత సమీపం లో చోటు చేసుకుంది.ఈ దుర్ఘటన లో 8 మంది చనిపోయారు కాగా 39 మంది గల్లంతయ్యారు. 26 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.నడుపుతున్నారని సమాచారం. ఏపీతోపాటు తెలంగాణకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఈ ప్రమాదం బారినపడ్డారు. వాస్తవానికి హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు భద్రాచలం మీదుగా పాపికొండలు యాత్రకు వెళ్తారు.
కానీ గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. దాదాపు రెండు నెలలుగా భద్రాచలం మీదుగా పాపికొండలు యాత్ర ప్యాకేజీని నిలిపేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన వారు శని లేదా ఆదివారాల్లో వేకువజామునే భద్రాచలం చేరుకొని.. సీతారాముల దర్శనం చేసుకుంటారు. తర్వాత కూనవరం, వీఆర్పురం వెళ్లి.. అక్కడి నుంచి బోటులో పాపికొండలు విహారయాత్రకు వెళ్తుంటారు. వీఆర్పురం మీదుగా పాపికొండలకు వెళ్లేందుకు 20 లాంచీలు ఉన్నాయి. కానీ ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో గోదావరికి భారీగా వరదలు వస్తుండటంతో.. భద్రాచలం మీదుగా పాపికొండలు యాత్రకు అనుమతి ఇవ్వడం లేదు.