Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్పర్చుకున్న అతిలోక సుందరి శ్రీదేవి ఈ మద్య పలు వివాదాలతో మీడియాలో నిలుస్తుంది. తాజాగా శ్రీదేవికి వీరాభిమాని అయిన ఒకతను తాను ఆరాధించే హీరోయిన్ పేరుమీద ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఆ రెస్టారెంట్‌లో శ్రీదేవి పేరుమీద కొన్ని వంటకాలు కూడా పెట్టాడు. ఆ రెస్టారెంట్‌కు వెళ్తే ఆ వ్యక్తికి శ్రీదేవిపై ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. అలాంటి అభిమాని ఉన్నందుకు ఇతర స్టార్స్ అయితే ఎంతో సంతోషిస్తారు. కాని శ్రీదేవి మాత్రం కాస్త భిన్నంగా ప్రవర్తించింది.
తన అనుమతి లేకుండా తన పేరును రెస్టారెంట్‌కు వాడటంతో పాట, తన పేరుతో వంటకాలను కూడా చేయడం ఏంటని ఆ అభిమానికి లీగల్ నోటీసులు పంపించింది. తన పేరును గతంలో రామ్ గోపాల్ వర్మ వాడేందుకు కూడా ఒప్పుకోని శ్రీదేవి అభిమాని వాడేందుకు కూడా నిరాకరించింది. తన పేరుతో బిజినెస్ చేసుకోవాలని చూసిన ఆ అభిమానిని కోర్టుకు లాగింది. తనకు డబ్బులు ఇస్తే కాని కేసును ఉపసంహరించుకోను అంటూ సన్నిహితులతో చెప్పి పంపినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి శ్రీదేవి తీరుపై సినీ వర్గాల వారిలో మరియు అభిమానుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎంత మాత్రం మంచిది కాదని, అభిమానులను ఇలా వేదించడం నీకు తగునా శ్రీదేవి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.