మనసులో మాట బయటపెట్టిన సచిన్

మనసులో మాట బయటపెట్టిన సచిన్

భారత్ లో క్రికెట్ కు జనాదరణ ఎంత ఉంది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మన ఆటగాళ్లలో సచిన్ ఆటకి ఒక ప్రత్యేకత ఉంది. భారత్ కి ఎన్నో విజయాలు అందజేసిన చెందిన ఈ బ్యాట్స్‌మెన్ ఆటతీరుకి చాలా అభిమనులే ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ లో 200 పరుగులు సాధించి, మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు ఇంకా అదేకాకుండా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరో సరికొత్త రికార్డు నెలకొలిపాడు. వన్డేలు, టెస్టులు కలిపి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఎవరూ సాధించని 100వ సెంచరీ కూడా పూర్తి చేశాడు. 463 వన్డే మ్యాచ్‌లు ఆడి 18,426 పరుగులు తీసి చాలా పెద్ద ఆటగాళ్లకి వణుకుపుట్టించి అగ్రస్థానంలో ఉన్నాడు.

ఒక వీడియోను లింక్‌డిన్‌లో షేర్‌ చేస్తూ 1994లో ఆక్లాండ్‌లో  జరిగిన మ్యాచ్‌లో రావడానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఎలా ఒప్పించారో, సక్సెస్‌ అవుతామనుకునే కెరీర్ లో రిస్క్‌ చేయడానికి వెనుకంజ వేయకూడదని, విఫలం అవుతామనే భయం ఎప్పటికీ ఉదరాదని అభిమానులకు చెప్పారు.

సక్సెస్‌ కావాలంటే రిస్క్‌ చేయాలి, లేకుంటే ముందుకు వెళ్లడం కష్టం,దానికి నేనే ఒక ఉదాహరణ. ఓపెనర్‌గా చేయడానికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా టీమిండియా మేనేజ్‌మెంట్‌ను బ్యాటింగ్‌కు చేయడానికి వేడుకుని, ముందుకువెల్లి విజయం సాదించా అని చెప్పారు. ఆ 25ఏళ్ల క్రితం నాటి ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సక్సెస్‌ కాలేకపోతే మళ్లీ ఎప్పుడూ మిమ్మల్ని అడగనని చెప్పి, లింక్‌డిన్‌లో తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.