విశాఖ లో భారీ అగ్నప్రమాదం… తగలబడిన థియేటర్లు…!

A Huge Fire Broke Out In Vasai Srikanya Theaters

విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో ఉన్న జంట సినిమా థియేటర్ లు ‘కన్య – శ్రీకన్య’లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. థియేటరులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. పొద్దున్నే థియేటర్ క్లీన్ చేయడానికి వచ్చిన స్వీపర్ యజమానికి ఫోన్ చేసి విషయం తెలుపగా ఆయన వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి.

heavy-fireaccedent

మంటలు దట్టంగా ఉండటంతో, చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న అధికారులు, వారిని ఖాళీ చేయించారు. గత రాత్రి సెకండ్ షో ముగిసిన తరువాత షార్ట్ సర్క్యూట్ సంభవించివుండవచ్చని థియేటర్ల నిర్వాహకులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగినపుడు థియేటర్ లో జనాలు లేకపోవడం వలన ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తప్ప ప్రాణనష్టం జరగలేదు, అదే గనుక జరిగి ఉంటే ప్రాణనష్టం భారీ గా ఉండేది.

fire-accedent