కరోనా వైరస్ జనం ప్రాణాలను తీయడమే కాకుండా కాపురాలను కూడా కూలదోస్తుంది. కరోనా లాడ్ డౌన్ కారణంగా పలువురు అక్రమ సంబంధాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కుటుంబాలకు దూరమైన భర్తలకు కొన్ని ఘటనలు షాకిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యాపార వేత్త పంకజ్ కు ఈ మధ్య రింకీతో పెళ్లయింది. నిత్యం వ్యాపారనికి సంబంధించిన పనుల కోసం ఇండియాలో పలుచోట్ల తిరుగుతూంటాడు పంకజ్. దీంతో లాక్ డౌన్ కు ముందు చండీగఢ్ కు వెళ్లి అక్కడే చిక్కుకు పోయాడు. అసలే కొత్తగా పెళ్లైంది. భార్య ఒక్కతే ఇంట్లో ఉండిపోవటంతో పంకజ్ కు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో తన చిన్ననాటి మిత్రుడైన రాకేష్ కు ఫోన్ చేసి భార్య గురించి చెప్పాడు. లాక్ డౌన్ పూర్తయ్యాక తాను వస్తానని అప్పటి వరకూ రింకీని జాగ్రత్త గా చూసుకోవాల్సిందిగా చెప్పాడు పంకజ్.
అంతేకాకుండా రోజూ భార్య రింకీకి వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు పంకజ్. రింకీ అవసరాలను రోజూ రాకేష్ తీర్చేవాడు. అయితే ఉన్నత కుటుంబంలో పుట్టిన రింకీకి మద్యం తాగే అలవాటు ఉంది. అలాగే.. పంకజ్ గతంలోనే అతని కోసం పెద్ద మొత్తం మద్యం తెచ్చుకొనే పెట్టుకున్నాడు. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమై పోయి బోర్ గా ఫీల్ అవుతున్న రింకీ మద్యం తాగాలని భావించింది. కంపెనీ ఇవ్వాల్సిందిగా రాకేష్ ని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి మద్యం సేవించడం ప్రారంభించారు. మద్యం మత్తు చివరికి శారీరక సంబంధానికి దారితీసింది ఇలా మొదలైన రాకేష్ రింకీలా బంధం ఇంటి ఆవరణలోనే స్విమ్మింగ్ పూల్ లో సరసాలు ఆడే వరకూ వెళ్ళింది. ఇంటి చుట్టూ సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని మరిచిపోయారు. వాళ్లు ఇదంతా తన మొబైల్ లో లైవ్ లో చూసిన భర్త పంకజ్ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం పై గట్టిగా నిలదీశాడు. లాక్ డౌన్ పూర్తి కాగానే విడాకుల తీసుకుంటానన్నాడు. ఊహించని షాక్ తగిలిన రింకీ భర్త పైన ఎదురు దాడి చేసింది. తప్పంతా నీదేనంటూ నిందను పంకజ్ పైకి నెట్టింది. తనకు విడాకులిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సావుకు నువ్వే కారణమంటూ సూసైడ్ నోట్ రాస్తానని బెదిపింపులకు దిగింది. దీంతో ఈ సారి పంకజ్ కు షాక్ తగిలింది.
చివరికి విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో పాటు వాళ్లు విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రింకీపై కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్ ని కటకటాల వెనక్కి నెట్టారు. మొత్తానికీ లాక్ డౌన్ కాపురాల్ని కూలుస్తున్న ఉంది అనటానికి ఇదో ఉదాహరణ మాత్రమే…