ఓపక్క కరోనా మరోపక్క అఘాయిత్యాలు… ఎటుపోతుంది లోకం అంటూ జనం. కరోనా మహమ్మారితో జనం అల్లల్లాడిపోతుంటే కామంధులు మాత్రం పెట్రేగిపోతున్నారు. కరోనా వైరస్ ను అణచివేసేందుకు హైదరాబాద్‌లో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. అందులో భాగంగా పోలీసులు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. భాగ్యనగరంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
అయితే తాగాజా దుండిగల్ పీఎస్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో మతిస్థిమితం లేని బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుత్బుల్లాపూర్‌లోని ఓ ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రోడా మేస్త్రీనగర్‌లో తాజాగా నడుకుచుంటూ వెళ్తున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన అక్బర్, జుమన్, గయాజ్, అలీం అనే యువకులు సమీపంలోని ఓ పాడుపడిన భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత బాలిక నిందితులకు తెలియకుండా వారి ఫోన్ నుంచే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు వెంటనే దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రెండు గంటల తర్వాత బాధితురాలు దేవేందర్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించి రక్షించారు. కాగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఓ వ్యక్తిని వెంటాడి పట్టుకున్నారు. కాగా మిగిలిన ముగ్గురి కోసం తీవ్రంగా గాలించారు. అయితే కాసేపటికే పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.