సొంత పిల్లలను చెరువులో పడేసిన కన్న తల్లి

సొంత పిల్లలను చెరువులో పడేసిన కన్న తల్లి

సొంత కన్నబిడ్డలను చంపేసింది ఓ తల్లి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వాసిమ్, నజ్మా దంపతులకు కవలలు పుట్టి 20 రోజులు అవుతోంది. అయితే వాసిమ్.. పనీపాటా లేకుండా గత కొన్నిరోజులుగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీనిపై భార్య నజ్మా అసహనంతో ఉంది. ఇదే విషయమై వీరిద్దరి మధ్య ఆదివారం ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. భర్త తీరుకు తీవ్రంగా నొచ్చుకున్న నజ్మా.. తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఊరి చెరువు దగ్గరకు వెళ్లింది. వారిని అందులో పడేసింది. అయితే తొందరపాటుతో తను చేసిన దాన్ని గుర్తించిన ఆమె.. తన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ నాటకానికి తెరలేపింది. స్థానికులకు కూడా అదే చెప్పింది. పైపెచ్చు స్థానిక శిఖేరా పోలీస్టేషన్‌లో తమ పిల్లలు కిడ్నాప్‌కు గురయ్యారంటూ దంపతులిద్దరూ ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో తన తప్పును నజ్మా అంగీకరించింది. భార్యాభర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు.