ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒక్కరు దారుణ హత్యకు గురయిన సంఘటన ఇచ్చోడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలంలోని పోన్న గ్రామనికి చెందిన బగ్నూరే జ్ఞానేశ్వర్‌ను (35) ఆదే మండలంలోని సుంకిడి గ్రామానికి చేందిన జాదవ్ శ్రీనివాస్ దారుణంగా హత్య చేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలో మీషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద హత్య చేసి మహారాష్టలోని మండివి అటవీ ప్రాంతంలో ఎవరికి అనుమానం రాకుండా వాహనంలో జ్ఞానేశ్వర్ శవాన్ని పడేశారు.
మూడు రోజులు నుంచి హత్యకు గురయిన జ్ఞానేశ్వర్ కనపడకుండా పోవడతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు, సమీప బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఎక్కడ ఆచూకీ తెలవక పోవడంతో ఆదివారం ఉదయం ఇచ్చోడ, సిరికొండ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఇచ్చోడ సీఐ కంప రవీందర్ బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వారి వివారాల ప్రకారం అనుమానితులను ఆదుపులోకి తీసుకుని విచారించారు.
జాదవ్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బగ్నూరే జ్ఞానేశ్వర్‌ను తానే హత్య చేసి శవాన్ని మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆదివారం సాయంత్రం సీఐ కంప రవీందర్, ఇచ్చోడ ఎస్సై సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి నేరస్తుడిని తీసుకెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని మండివి అటవీ ప్రాంతలో నుంచి శవాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ అస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్, ఎస్సై సుర్యప్రకాశ్ తెలిపారు.