దేవర’ నుంచి ప్రత్యేక పోస్టర్…..

దేవర’ నుంచి ప్రత్యేక పోస్టర్.....
Cinema News

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్నభారీ యాక్షన్ చిత్రం ‘దేవర’. ఈ సినిమా ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నవిషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కీలక సన్నివేశాలను పూర్తి చేస్తూ వస్తూ ఉన్నారు . ‘దేవర’ నుంచి చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. మరో 5 నెలల్లో మూవీ థియేటర్లలో రానున్నట్లు ప్రత్యేక మాస్ పోస్టర్ను షేర్ చేసింది. ‘భయానికి కొత్త పేరు ఉంటే అదే దేవర. మరో 150 రోజుల్లో విధ్వంసాన్ని థియేటర్లలో వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది.

దేవర’ నుంచి ప్రత్యేక పోస్టర్.....
Junior NTR

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1 ఏప్రిల్ 4న థియేటర్లలో రానుంది. ‘దేవర’ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం విశేషం. భారీ యాక్షన్ సీన్లు ఉండటంతో గ్రాఫిక్ విషయంలోనూ ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఇక ఈ చిత్రంలో ఊర్వశీ రౌటేలా ఐటెమ్ సాంగ్ చేయబోతుండటం విశేషం. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండటం విశేషం.