Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేరళను ప్రాణాంతక నిఫా వైరస్ ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. తాజాగా నిఫా వైరస్ లక్షణాలతో కేరళలో ఓ మహిళ మృతిచెందింది. పెరియారంలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల మహిళ అనారోగ్యానికి గురికావడంతో పెరియారం మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఈమెకు నిఫా వైరస్ లక్షణాలున్నాయని కొద్దిరోజుల క్రితం తేలడంతో పెరియారం నుంచి కోజికోడ్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం ఆమె మరింత అనారోగ్యానికి గురికావడంతో ప్రత్యేక గదిని కేటాయించి ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
వ్యాధి మరింత ముదిరి శనివారం ఆమె మృతిచెందింది. అయితే ఆమె మరణానికి నిఫా వైరసే కారణమని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించడంలేదు. ఆ మహిళకు నిఫా లక్షణాలు ఉండడంతో పెరియారం నుంచి కోజికోడ్ కు తరలించామని, ఆమె నమూనాలను పరీక్షించినప్పుడు నిఫా నెగటివ్ అని తేలిందని వారు చెబుతున్నారు. కానీ పరిస్థితి విషమించి ఆమె ఈ రోజు మృతిచెందిందని తెలిపారు. అయితే వైద్య పరీక్షల్లో మరో ఇద్దరికి నిఫా ఉన్నట్టు తేలిందని, వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు.