శింబు మరీ ఇంత దారుణంగా వ్యవహరించాడా?

AAA Producer Michael Rayappan comments on simbu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళ హీరో శింబుపై ఇప్పటి వరకు ఎన్ని సార్లు, ఎంత మంది విమర్శలు చేశారో లెక్కే లేదు. తమిళంలో అత్యంత వివాదాస్పద హీరోగా పేరు తెచ్చుకున్న శింబు వల్ల తాను పడ్డ కష్టాలను ఒక నిర్మాత మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. ఆ నిర్మాత మాటలకు అంతా నోరెళ్ల బెట్టాల్సిందే. మరీ ఇంత నీచంగా శింబు ప్రవర్తిస్తాడా అంటూ స్వయంగా తమిళ సినీ వర్గాల వారు కూడా కొందరు అవాక్కవుతున్నారు. శింబు ఆ మద్య ‘ఏఏఏ’ అనే చిత్రాన్ని చేశాడు. ఆ చిత్రంలో శింబు మూడు పాత్రలను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. షూటింగ్‌ కోసం 100 రోజులు డేట్లు ఇచ్చి కేవలం 35 రోజులు మాత్రమే చిత్రీకరణకు హాజరు అయ్యాడట. తాను అనుకున్న లొకేషన్స్‌కు పలు సార్లు చిత్ర షూటింగ్‌ను మార్చాడు అని, అలా చేయడం వల్ల పలువురు నటీ నటుల డేట్లు వృదా అయ్యాయి అంటూ నిర్మాత మైకేల్‌ రామప్పన్‌ చెప్పుకొచ్చాడు.

Producer Michael Rayappan

నిర్మాత మైకేల్‌ ఇంకా మాట్లాడుతూ.. తాను అనుకున్న చోట మాత్రమే షూటింగ్‌ చేయాలని చెప్పేవాడని, ఎప్పుడు కూడా సరైన సమయంకు రాలేదని, సినిమాలో అయిదు పాటలు అనుకుంటే కేవలం ఒక్క పాటను మాత్రమే చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలో మూడు పాత్రలు ఉండగా కేవలం రెండు పాత్రల్లో నటించి మూడవ పాత్ర అవసరం లేదు అంటూ నో చెప్పాడు. అయితే తాను కళ్ల మీద పడి బతిమిలాడటంతో ఆయన ఇంట్లోనే మూడవ పాత్రకు సంబంధించిన కొన్ని షాట్స్‌ను చేసేందుకు ఒప్పుకున్నాడు.

AAA Producer

ఇక డబ్బింగ్‌ చెప్పేందుకు థియేటర్‌కు రాకుండా బాత్‌రూంలో డైలాగ్‌లు వాయిస్‌ రికార్డు ద్వారా చేసి, పంపించాడని, వాటిని సింక్‌ చేసేందుకు తాము చాలా కష్టపడ్డట్లుగా నిర్మాత చెప్పుకొచ్చాడు. మూడు పాత్రల కోసం మూడు రకాలుగా బరువు మారుతాను అంటూ చెప్పిన శింబు కనీసం ఒక్క పాత్ర కోసం కూడా రెడీ కాలేదు అన్నాడు. ఇక మేకప్‌ కూడా సరిగా వేయించుకునేవాడు కాదని, ప్రతిదానికి కూడా చిరాకు పడేవాడు అంటూ నిర్మాత శింబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ దెబ్బతో శింబుతో సినిమాను చేసేందుకు ఏ నిర్మాత ముందుకు వచ్చే అవకాశం లేదు.