సాలిడ్ కంటెంట్ ఉంటే, పెద్ద మూవీ లు చిన్న మూవీ లు అనే తేడా బాక్సాఫీస్ వద్ద ఉండదు. కంటెంట్ తో మెప్పిస్తే థియేటర్ల కి క్యూ కడతారు ప్రేక్షకులు. గతవారం రిలీజైన ఆయ్ మూవీ పరిస్థితి కూడా అంతే. పెద్ద మూవీ ల తో పాటుగా, కొన్ని పరిమిత థియేటర్ల లో రిలీజైన ఆయ్ మూవీ మొదటి రోజు 62 లక్షల రూపాయల వసూళ్లని రాబట్టింది. కానీ, నాల్గో రోజుకి వచ్చే సరికి ఏకంగా 300 రెట్లు అధికంగా 2.2 కోట్ల రూపాయల వసూళ్లని రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేసింది.
నార్నే నితిన్ మరియు నయన్ సారిక లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కు అంజి కే. మణిపుత్ర దర్శకత్వం వహించారు . అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ కి రామ్ మిరియాల సంగీతం అందించాడు. ఈ మూవీ లాంగ్ రన్ లో మరింత వసూళ్లని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.