చీరాల లో రెచ్చి పోతున్న ఆమంచి సైన్యం

చీరాల లో రెచ్చి పోతున్న ఆమంచి సైన్యం

చీరాల స‌మీపంలోని వేట‌పాలెం గ్రామ నివాసి నాయుడు నాగార్జునరెడ్డి ప్ర‌జాసంఘాల‌లో ప‌నిచేస్తున్నారు. గ‌తంలో కొన్ని ప‌త్రిక‌ల్లో విలేకరిగా ప‌నిచేశారు. ఆ సంద‌ర్భంగానే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌తో ఆయ‌న‌కు వివాదం మొద‌లైంది. నాగార్జునరెడ్డి సాక్షి ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న కాలంలో నాటి తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యుడిగా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాశారు.

2007లో నాగార్జున‌పై చీరాల క్లాక్ ట‌వ‌ర్ సెంట‌ర్‌లో దాడి జరిగింది. సీసీ కెమెరాల్లో రికార్డైన నాగార్జున‌పై దాడి దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై కేసు కూడా నమోదైంది.

నాగార్జునరెడ్డి మీద 2017, 2018 సంవత్సరాల్లో కూడా వరుసగా రెండుసార్లు దాడులు జ‌రిగాయి. తాజాగా సోమ‌వారం సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో చిన‌గంజాం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మూడోసారి దాడి జ‌రిగింది.”ఒంగోలు ఎస్‌పీ గారిని స్పంద‌న కార్య‌క్ర‌మంలో కలిసేందుకు వెళ్లి వ‌స్తుండ‌గా నా భర్తపై దాడికి పాల్ప‌డ్డారు” అని ఆమె తెలిపారు.

అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి చీరాల సమీపంలో పడేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో పడి ఉన్న నాగార్జునరెడ్డిని స్థానికులు ఇచ్చిన సమాచారంతో తొలుత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం మొదట చీరాలలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి, తర్వాత ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు.

చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌తో పాటు ఆయన సోదరుడు సోములు వ్యవహారశైలి అనేకమందిని ఇబ్బందులకు గురిచేస్తోందని, ఆయన ప్రమేయంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.