దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్య ఓ డాక్టర్(52) ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు డాక్టర్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు కూడా. దీంతో ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అలాగే ఎమ్మెల్యే అనుచరుడైన కపిల్ పై కూడా కేసు నమోదైంది. వీరిద్దరినీ అరెస్ట్ చేసేందుకు తాజాగా పోలీసులు రెడీ అయినట్లు సమాచారం అందుతుంది. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని తండ్రి, సోదరుడిని విచారిస్తున్నారు.
అదేవిధంగా తనకు ఈ ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదని.. గత 10 నెలల కాలంలో ఆ డాక్టర్‌ను ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ‘సూసైడ్ నోట్‌లో నా పేరు ఉందని మీడియా ద్వారా తెలిసింది. ఆయన నా పేరు ఎందుకు రాశాడో అర్థకావడం లేదు. గత 8-10 నెలల్లో నేను అతన్ని కలిసిన సందర్భాలు లేవు. గతంలో కూడా నన్ను చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా నాపై జరుగుతుండటం ఆశ్చర్యమేస్తుంది. గతంలో నిర్దోషిని అని నిరూపించుకున్నట్లే.. ఇప్పుడు కూడా రుజువు చేసుకుంటాను. ఎలాంటి దర్యాప్తులకైనా.. పోలీసులకు సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ స్పష్టం చేశారు.