అభినందన్ ని అందుకు అభినందిన్చాలిందే…ఫైర్ అవుతున్న నెటిజన్లు !

Abhinandan

ఎఫ్-16కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చిన తొలి పైలట్ గా భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నిలిచాడని, ఈ పని చేసిన తొలి వాయు సైనికుడు అతనేనని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ వెల్లడించారు. అమెరికా తయారుచేయగా, పాకిస్థాన్ కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చడం అత్యంత సాహసోపేతమైన చర్యని ఆయన కితాబిచ్చారు. వాస్తవానికి ఎఫ్-16 మిగ్-21 సాటిరాదని ఆయన అన్నారు. యుద్ధంలో మిగ్ లతో పోలిస్తే ఎఫ్-16లు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. అయితే, మిగ్ విమానాలను నడిపే పైలట్లు తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మిత్ర దేశాల వద్ద ఉన్న ఎఫ్-16, మిరాజ్ ఫైటర్ జెట్స్ తోనూ శిక్షణ పొందుతుంటారని, అదే అభినందన్ కు ఈ స్థితిలో పనికివచ్చిందని అన్నారు.

ఎయిర్ వార్ చాలా వేగంగా ఉంటుందని, శత్రువుల కన్నా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని, సెకన్లలో సరిహద్దులను దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో అభి, ఎఫ్-16 విమానాన్ని కూల్చడం అసాధారణమేనని కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు. అయితే అభినందన్ వర్ధమాన్ ధైర్యాన్ని, చూపించిన తెగువను తమ ఖాతాలో వేసుకుని రాజకీయ ప్రయోజం పొందాలని చూస్తున్న రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఆయన యూపీఏ ప్రభుత్వ హాయాంలోనే పైలట్ గా ఎదిగాడని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించగా, నెటిజన్లు ఆయన మీద తిట్లదండకం అందుకున్నారు. అలాగే అభినందన్ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలనూ నెటిజన్లు వదలడం లేదు.