జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై స్పందించిన అచ్చెన్నాయుడు….ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్ఠీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్ని అడగాలని.. ఎవరినీ స్పందించమని మేం అడగబోమని అచ్చెన్నాయుడు చెప్పారు . apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ను టీడీపీ సీనియర్ నేతలు ప్రారంభించారు .
ఈ కార్యక్రమానికి యనమల, నిమ్మల రామానాయుడు,అచ్చెన్నాయుడు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…చంద్రబాబును సంబంధం లేని కేసులో ఇరికించారని.. హైదరాబాద్ లో విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో వచ్చినట్లు రోడ్డుపైకి వస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు . ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలనే ఉద్దేశ్యంతో వెబ్ సైట్ ఓపెన్ చేశా మని.. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్ సైటులో పొందుపరిచామని వెల్లడించారు. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైందన్నారు. కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు .