తండ్రిని చూసి భోరున విలపించిన జూనియర్, కళ్యాన్ రామ్ లు…!

Actor Harikrishna Passed Away

ఈరోజు తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి హరికృష్ణ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి అక్కడికి బయలుదేరి వెళ్ళిన ఆయన కుమారులు తండ్రి మృతదేహం చూసి బోరున విలపించారు. అందుతున్న సమాచారం మేరకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలోనే హరికృష్ట మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం జరగనున్నది.

harikrishna-nandhamuri

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు. మృతదేహాన్ని కామినేని ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని ఆయన స్వగృహం నందు ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు.

harikrishna-dead