కన్నీళ్లు తెప్పిస్తోన్న హరికృష్ణ చివరి లేఖ ఇదే!

Hari Krishna Wrote His Last Letter About his Birthday

ఈ ఉదయం నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్బంగా అభిమానులకు ముందుగానే ఒక లేఖ ద్వారా సందేశాన్ని ఇచ్చారు. తన అభిమానులకు చేసిన ఆఖరి విజ్ఞప్తి ఇది. ఆయన తన స్వహస్తాలతో రాసిన చివరి లేఖలో కేరళను ఆదుకోవాలని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. చివరి సారి తన స్వహస్తాలతో రాసిన ఆ లేక యొక్క ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు
అభిమానులు.
harikrishna last letter

ఆయన రాసిన లేఖ యధాతధంగా
“సెప్టెంబర్ 2న నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా, ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. ఇందుచేత నా జన్మదిన సందర్భంగా, బేనరులు, ప్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్పగుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చుని వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, మందులు, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను”
ఇట్లు
నందమూరి హరికృష్ణ

Hari Krishna