నంద‌మూరి హ‌రికృష్ణ సినీ ప్ర‌స్థానం…!

nandhamuri-police-pics
సినీ న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ సినీ, రాజ‌కీయ రంగాల‌ను ఆయనకు రెండు క‌ళ్ల లాగా చూస్తూ వ‌చ్చారు. అయితే గ‌త ద‌శాబ్దం నుంచి పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు ప్రస్తుతం హరికృష్ణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరపున ఒకసారి రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యాడు. అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా రాజీనామా చేశారు. రాజ‌కీయాల్లో మంత్రి సహా వివిధ ప‌ద‌వులు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ సినిమాల ద్వారానే ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి ఎక్కువ‌గా చేరువ‌య్యారు.
Nandamuri Harikrishna Cine Reigns
1967లో బాలనటుడిగా ‘శ్రీకృష్ణావతారం’తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆయన, పలు చిత్రాల్లో నటించారు. 1974లో తాత‌మ్మ‌క‌ల సినిమాతో పూర్తిస్థాయి న‌టుడిగా మారారు.  ఆ త‌ర్వాత వ‌రుస సినిమా అవ‌కాశాలు రావ‌డ‌మైంది. 1998లో శ్రీ‌రాముల‌య్య సినిమాలో స‌త్యం పాత్ర‌లో ఒదిగిపోయారు. 1999 సంవ‌త్స‌రంలో సీతారామ‌రాజు సినిమా ప్ర‌జ‌ల్లోకి మ‌రింత‌గా వెళ్లేలా చేసిందని సినీ ప్రియులు చెబుతుంటారు.
harikrishna-cine-life
ఆ త‌ర్వాత 2002లో లాహిరి లాహిరి లాహిరిలో త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌ను మ‌రింత వెలికితీశారు. అదే సంవ‌త్స‌రంలో శివ‌రామ‌రాజులో న‌టించారు. ఇలా ఆయన ‘తల్లా పెళ్లామా’, ‘తాతమ్మకల’, ‘రామ్ రహీమ్’, ‘శ్రీరాములయ్య’, ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామరాజు’, ‘సీతయ్య’, ‘టైగర్ హరిశ్చంద్రప్రసాద్’, ‘స్వామి’, ‘శ్రావణమాసం’ చిత్రాల్లో నటించారు. చివ‌ర‌గా 2004లో స్వామి, 2005 సంవ‌త్స‌రంలో శ్రావ‌ణ‌మాసం త‌ర్వాత సినిమాల నుంచి దాదాపుగా వైదొల‌గారు. ఎన్టీఆర్ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు.
nandhamuri-family