మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్(అమ్మ) ప్రెసిడెంట్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్ అయ్యి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నటుడు దిలీప్‌ను తిరిగి అమ్మలోకి తీసుకు రావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరోయిన్ లైంగిక వేదింపుల కేసులో ప్రధాన నిందితుడు అయిన దిలీప్ చాలా రోజుల పాటు జైల్లో ఉండి వచ్చాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉండి కోర్టుకు హాజరు అవుతూ, విచారణ ఎదుర్కొంటున్న దిలీప్‌కు తిరిగి అమ్మలో స్థానం కల్పిస్తూ మోహన్‌లాల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించాడు.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌లాల్ ఈ విషయమై స్పందిస్తూ… దిలీప్‌కు అమ్మలో సభ్యత్వం ఇవ్వడం అనేది నా ఒక్కడి నిర్ణయం కాదని, సభ్యులందరి ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, రాజకీయ ఒత్తిడులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు రాజకీయాలకు ఇందులో చోటు లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారికి అమ్మలో స్థానం కల్పించడం అంటే, ఆడవారికి అమ్మ వ్యతిరేకం అన్నట్లే అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలోనే మోహన్‌బాబు ఆ వ్యాఖ్యలను కొట్టి పారేశాడు. మలయాళ సినిమా పరిశ్రమ ప్రతి ఒక్కరి మనోభావాలకు అనుగునంగా పనిచేస్తుందని మోహన్‌లాల్ చెప్పుకొచ్చాడు. మోహన్‌లాల్ వివరణ తర్వాత కూడా వివాదం సర్దుమనగడం లేదు. ఖచ్చితంగా దిలీప్‌కు ఇచ్చిన సబ్యత్వంను తొలగించాల్సిందే అని, లేదంటే వరుసగా రాజీనామాలు చేస్తాం అంటూ పలువురు సభ్యులు హెచ్చరిస్తున్నారు. మరి మోహన్‌లాల్ ఈ పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.