అక్కడ హార్దిక్…ఇక్కడ రాజశేఖర్.

actor-rajasekhar-says-about-his-personal-issue

 Posted November 14, 2017 at 11:26 

“నాకు పెళ్లి కాలేదు, నపుంసకుడిని కాదు “… అంటూ ఓ సెక్స్ వీడియో బయటికి వచ్చాక గుజరాత్ లో పటేల్ రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ ప్రకటించాడు. అంతకు కొన్ని రోజుల ముందే గరుడ వేగ సక్సెస్ జోష్ లో వున్న టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు అక్రమ సంబంధాలున్నాయి అని చెప్పేసాడు. వీళ్లిద్దరు చెప్పిన మాటలు కొద్దిగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి తప్ప అదే పనిగా వాటిపై చర్చ జరగడం లేదు. వామ్మో వీళ్లేంటి ఇంత మాట అనేసారు అని నోటి మీద వేలు వేసుకోడాలు, నొసలు చిట్లించడాలు కనిపించలేదు. ఈ ఇద్దరు సెలెబ్రెటీల్లో రాజశేఖర్ నిజాయితీగా వున్న విషయం చెప్పేస్తే, హార్దిక్ అవసరార్ధం అయినా అందులో తప్పేమీ లేదని సమర్ధించుకున్నారు.

hero-rajashekar

నిజానికి హార్దిక్, రాజశేఖర్ ప్రకటనల్లో వింత, విడ్డూరం లేదు. ఇలాంటి వ్యవహారాలు ఈ సమాజంలో బహిరంగ రహస్యమే. అది తప్పా,ఒప్పా అన్న తర్కాన్ని పక్కనబెడితే ఒకప్పుడు ఇదే విషయాన్ని ఒప్పుకోడానికి ఏ ఒక్కరూ ముందుకు వచ్చే వారు కాదు. ఇందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అప్పట్లో గవర్నర్ గా పని చేసిన Nd తివారీ ని మించిన ఉదాహరణ ఏముంది?. రాజ్ భవన్ లో రాసలీలలతో పరువు పోగొట్టుకున్న ఆయన ఎప్పుడూ ఆ తప్పుని ఒప్పుకోలేదు. ఇక ఓ సంబంధం వల్ల బిడ్డని కని వారు ఎంత పోరాడినా కాదనే చెప్పారు. చివరకు డిఎన్ఏ పరీక్ష ,కోర్టు తీర్పు తో నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చావుబతుకుల్లో అనారోగ్యంతో వున్న ఆయన్ని ఆ తల్లీబిడ్డలే చూసుకుంటున్నారు. ఇలాంటి సంబంధాలు ఒప్పుకోడానికి నాటి తరం ఎంతగా సంశయించేదో చెప్పేందుకు తివారీ ని చూసి తెలుసుకోవచ్చు. ఇందుకు కారణం ఇలాంటి విషయాలు బయట పడినప్పుడు సమాజం తమని ఎలా చూస్తుందో అన్న బెరుకు.

Hardik Patel Reservation Movement in Gujarat
ఒకప్పుడు ఇలాంటి విషయాలు ఎవరైనా మాట్లాడితేనే పెద్ద చర్చ జరిగేది. ఇప్పుడు హార్దిక్, రాజశేఖర్ స్వయంగా ప్రకటనలు చేసినా వారి మీద తీవ్ర వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదు. జనాలు లైట్ తీసుకోవడమే కాదు, ఓపెన్ గా చెప్పారని అక్కడక్కడా మెచ్చుకుంటున్నారు కూడా. తప్పు, ఒప్పు అన్నది పక్కనబెడితే వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితి సమాజ పరిణితికి నిదర్శనం. ఏ సమాజానికి అయినా నైతికత, విలువలు అవసరమే. కానీ పైకి అవి చెప్పుకుంటూ లోలోన ఆ పరిధులు దాటి ప్రవర్తించడం కన్నా ముందుగా వున్న నిజాన్ని ఒప్పుకోవడం కాస్త ముందో, వెనుకో మంచికే దారి తీస్తుంది. హార్దిక్, రాజశేఖర్ ప్రకటనల భారతీయ సమాజంలో వచ్చిన ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

SHARE