హరితేజకు జరిగిన అవమానం ఏంటి?

Actress Hari Teja Emotional Talk About Mahanati Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమా వారు అంటే సాదారణ జనాల్లో క్రేజ్‌ అయితే ఉంటుంది, కాని చులకన భావం కూడా ఉంటుంది. సినిమా వారిది చీప్‌ క్యారెక్టర్‌ అంటూ చూసేవారు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్న అమ్మాయిలపై పలువురు పలు రకాలుగా అభిప్రాయాలను కలిగి ఉంటారు. అందుకే సినిమా పరిశ్రమ వారిని అభిమానిస్తారు కాని, వారితో కలిసి జీవించేందుకు మాత్రం పద్దతి కలిగిన కుటుంబం మాది అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా హరితేజకు సినిమా హాల్‌లో ఇలాంటి అవమానం ఎదురైంది.

‘మహానటి’ సినిమాను చూసేందుకు ఒక మల్టీప్లెక్స్‌కు హరితేజ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. సినిమా మొదటి సగంను తన చెల్లి పక్కన కూర్చుని చూసిన హరితేజ సెకండ్‌ హాఫ్‌ను తల్లి పక్కన కూర్చుని చూడాలనిపించి, తన సీటు నుండి లేచి తన తల్లి పక్క సీటుకు వెళ్లింది. ఆ సమయంలోనే ఆ పక్కన సీటులో ఉన్న ఒక మహిళ తన భర్త పక్కన కూర్చునేందుకు మీ లేదు అంటూ దబాయించింది. మీరు సినిమా వారు ఎక్కడైనా కూర్చుంటారు, ఎవరితో అయినా కూర్చుంటారు. కాని మేం అలా కాదు, మాకు పద్దతి, కట్టుబాట్లు ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు హరితేజకు తీవ్ర కోపంను తెప్పించాయి. దాంతో హరితేజ ఆమెపై గొడవ పడటం జరిగింది. సినిమా పరిశ్రమకు చెందిన అడవారికి బయట ప్రపంచంలో జరుగుతున్న అవమానం ఇది అంటూ సెల్ఫీ వీడియోను తీసుకుని కన్నీరు పెట్టుకుంటూ తన ఆవేదనను హరితేజ వ్యక్తం చేసింది.