బన్నీకి కొంతైనా సంతోషం దక్కింది

Naa Peru Surya naa illu india Movie Created Record in Kerala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

అల్లు అర్జున్‌ హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ చిత్రం ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అల్లు అర్జున్‌ పాత్ర బాగుంది, కాని సినిమా స్క్రీన్‌ప్లే మరియు స్టోరీ లైన్‌ అంతగా ఆకట్టుకోలేక పోయింది అంటూ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు తేల్చి పారేశారు. దాంతో భారీగా వసూళ్లు చేస్తుందనుకున్న ఈ సినిమా అంతగా వసూళ్లు చేయలేక పోయింది. ఈ సమయంలోనే మహానటి విడుదలవ్వడం కూడా సూర్యకు పెద్ద మైనస్‌ అని చెప్పుకోవచ్చు. అంతా షాకింగ్‌గా అల్లు అర్జున్‌ భావిస్తున్న సమయంలో ఆయనకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త మలయాళ మీడియాలో వచ్చింది.

‘నా పేరు సూర్య’ చిత్రాన్ని మలయాళంలో డబ్‌ చేసి ‘ఎండె పేరు సూర్య ఎండె వీడు ఇండియా’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వదిలారు. తెలుగులో విడుదలైన కొన్ని రోజులకు మలయాళంలో విడుదల చేయడం జరిగింది. కేరళలో బన్నీకి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. సినిమా సక్సెస్‌ అయినా, ఫ్లాప్‌ అయినా మినిమం కలెక్షన్స్‌ వస్తాయి. అయితే ఈ సినిమాకు మాత్రం మినిమం కంటే ఎక్కువగానే వస్తున్నాయి. విడుదలైన వారం రోజుల్లో 5 కోట్లను రాబట్టిన ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో 10 కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. తొగు రాష్ట్రాలతో పోల్చితే అక్కడ చాలా తక్కువ వసూళ్లు నమోదు అవుతాయి. 10 కోట్లు అనేది అక్కడ స్టార్‌ హీరో రేంజ్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయినట్లుగా చెప్పుకోవచ్చు. అందుకే అక్కడైనా ఈ సినిమా విడుదలై సక్సెస్‌ అయినందుకు బన్నీ సంతోష పడుతున్నారు.