కళ్యాణ్‌ రామ్‌ కంటే తమన్నాకు ఎక్కువ!!

Tamanna Takes More Remuneration Than Kalyan Ram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మిల్కీబ్యూటీ తమన్నా గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్దగా క్రేజ్‌ లేనీ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తుంది. బాహుబలి సినిమాలో నటించిన తర్వాత ఈమెకు మరో రెండు మూడు సంవత్సరాల వరకు చేతినిండా సినిమాలు అని అంతా భావించారు. కాని అనూహ్యంగా సినిమా ఛాన్స్‌లే ఆమెకు కరువు అయ్యాయి. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఈమెకు నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన నా నువ్వే చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ దక్కింది. ఆ సినిమా కోసం తమన్నా తీసుకున్న పారితోషికం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీగా ఉంది.

‘నా నువ్వే’ సినిమాలో తమన్నాది చాలా కీలకమైన పాత్ర అంటూ సమాచారం అందుతుంది. పాత్రకు తగ్గట్లుగా ఆమె బాడీలాంగ్వేజ్‌ ఉంటుంది. అందుకే ఆ పాత్రకు తమన్నా అయితేనే బాగుంటుందని దర్శకుడు జయేంద్ర ఫిక్స్‌ అయ్యాడు. అందుకే ఆమెనే తీసుకుని తీరాలని నిర్మాతలకు కోరాడు. ఆమె కళ్యాణ్‌ రామ్‌తో నటించేందుకు ఏకంగా రెండు కోట్లు డిమాండ్‌ చేసిందట. అయినా కూడా ఆమెనే ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా కోసం కళ్యాణ్‌ రామ్‌ కోటి రూపాయల పారితోషికం తీసుకున్నాడు. మరో కోటి సినిమా సక్సెస్‌ అయితే తీసుకునే ఖరారు. అంటే ప్రస్తుతానికి చూసుకుంటే సినిమాలో నటించినందుకు తమన్నాకు కళ్యాణ్‌ రామ్‌ కంటే ఎక్కవ పారితోషికం దక్కిందన్నమాట.