రాజశేఖర్‌ను కలిసిన విషయం వేరు..!

director krish clarity about his meets rajashekar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘కాబోయే అల్లుడు’ అనే చిత్రాన్ని తేజ తెరకెక్కించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కోసమే పదే పదే రాజశేఖర్‌ను తేజ కలుస్తున్నాడని, ఈ మద్య కాలంలో పది సార్లు తేజ, రాజశేఖర్‌లు కలుసుకున్నారు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దాంతో చిరంజీవికి వ్యతిరేకంగా తేజతో ఉదయ్‌ కిరణ్‌ సినిమాను చేయించేందుకు రాజశేఖర్‌ ప్రయత్నాు చేస్తున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో దర్శకుడు తేజ తాను అసలు ఉదయ్‌ కిరణ్‌ ఆటో బయోగ్రఫీని అనుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

మొదటి నుండి కూడా తనకు రాజశేఖర్‌ అంటే ప్రత్యేమైన అభిమానం ఉందని, ఆ అభిమానంతోనే ఆయనతో కలిసి వర్క్‌ చేయాలనే కోరిక ఉండేది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. మొదట నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం రాజశేఖర్‌ను సంప్రదించాను. కాని ఆయన కొన్ని కారణాల వల్ల నో చెప్పాడు. ఇప్పుడు రానాతో ఒక సినిమాను ప్లాన్‌ చేస్తున్నాను. ఆ సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌ను ఎంపిక చేయాలని, ఆయనకు పలు సార్లు కథ, పలు వర్షన్‌లలో కథను వివరించాను. అందుకే రాజశేఖర్‌ గారిని పదే పదే కలిశాను తప్ప మరే ఇతర కారణం లేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రాజశేఖర్‌ విలన్‌గా నటించేందుకు ఒప్పుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.