Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పలు షార్ట్ ఫిల్మ్‌లు తీసిన యోగి తనను మోసం చేశాడు అంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద పది వేల రూపాయలు తీసుకుని వాటిని ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు, పలు రకాలుగావేదిస్తున్నాడు అంటూ హారిక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు విచారణకు యోగిని పిల్చారు. ఆ సమయంలో యోగి అతిగా మాట్లాడాడు అంటూ డీసీపీ గంగిరెడ్డి కాలితో తన్నడంతో పాటు, చేతితో రెండు దెబ్బలు వేశాడు. ఆ వీడియో కాస్త బయటకు రావడంతో వైరల్ అయ్యింది. యోగి, హారిక మద్య వివాదం ఏంటని అంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హారిక మొదట కేసు నమోదు చేయాలనుకోలేదు. యోగి తనను బెదిరించకుండా, తనకు ఇవ్వాల్సిన మొత్తం ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరింది. అయితే వివాదం కాస్త పెద్దది అయ్యింది. యోగిపై గతంలోనే కేసులు ఉన్నాయి. దాంతో పోలీసులు కాస్త సీరియస్‌గా తీసుకున్నారు. దానికి తోడు వీడియో వైరల్ అవ్వడంతో యోగి, హారిక వ్యవహారం పెద్దగా మారింది. ప్రస్తుతం ఈ విషయంపై ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా ఉన్నారు. దాంతో యోగి విషయంలో మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. గతంలో యోగిపై ఉన్న కేసులను తోడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జేడీ చక్రవర్తి భార్య కూడా యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.