శ్రద్ధాతో జోడీ కట్టిన ఆది !

adi-to-pair-with-shraddha-srinath

బుర్ర కధ సినిమాతో మనముందుకు వచ్చిన ఆది సాయికుమార్‌ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ఆ చిత్రానికి ‘జోడి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘జెర్సీ’ ఫేమ్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సెప్టెంబర్‌ 6న విడుదల చేయబోతున్నారు.

‘ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్‌ ఆసాంతం చాలా ఆహ్లాదంగా ఉన్నట్టుగా ప్రశంసలు వచ్చాయి. ఆది సాయికుమార్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటూనే యూత్‌ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ముఖ్యంగా ప్రేమకథ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవబోతోంది.

అందుకు తగ్గట్టుగానే ఆదిసాయికుమార్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది’ అని నిర్మాత తెలిపారు. గతంలో ‘వాన’, ‘మస్కా’, ‘సినిమా చూపిస్త మామ’ చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన విశ్వనాథ్‌ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ చివరి దశలో ఉంది. ఈ సినిమా భావన క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోంది. శ్రీనివాస్‌ గుర్రం సమర్పణ. ఫణికళ్యాణ్‌ బాణీలు సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ : ఎస్‌.వి, విశ్వేశ్వర్‌, ఎడిటర్‌ : రవి మండ్ల, మాటలు : త్యాగరాజు(త్యాగు), నిర్మాత : శాంతయ్య.