భర్తను గుద్ది ఐదు కిలోమీటర్లు కారుతో ఈడ్చుకెళ్ళిన భార్య ! 

Wife hitting her husband for five kilometers

చైనాలో చోటుచేసుకున్న ఒఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భర్త ఏం చేశాడో తెలీదుగానీ.. అతడి భార్యకు బాగా కోపం తెప్పించాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆమె భర్తపైకి కారు పోనిచ్చింది. దీంతో అతడు కారు బొనెట్‌ను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు.

అలా సుమారు ఐదు కిలోమీటర్లు అతడు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాడు. ఆ సమయంలో కారులో భార్యతోపాటు అతడి పిల్లలు కూడా ఉన్నారు. అసలు విషయంలోకి వెళ్తే బిజియే నగరానికి చెందిన ఓ జంట మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో భార్య తన ముగ్గురు పిల్లలను పట్టుకుని కారులో ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది.

వారిని అడ్డుకునే క్రమంలో భర్త కారుకు అడ్డుగా వెళ్లాడు. అయితే, ఆమె కారు ఆపకుండా ముందుకు పోనిచ్చింది. దీంతో అతడు కారు బానెట్‌ మీద పడ్డాడు. అప్పటికీ ఆమె కోపం తగ్గలేదు దీంతో ఐదు కిలోమీటర్ల వరకు కారు అలాగే నడిపింది. ఇది గమనించిన పోలీసులు భార్య, భర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి చివాట్లు పెట్టి వదిలిపెట్టారు. దీంతో శత్రువుల్లా వచ్చిన ఆ జంట స్నేహితుల్లా ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.