మూడో తరగతి విద్యార్ధి దారుణ హత్య !

The brutal murder of a third-grade student

కృష్టాజిల్లాలోని చల్లపల్లి బీసీ హాస్టల్‌లో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆదిత్య అనుమానాస్పదంగా మృతి చెందాడు.  బాత్రూంలో రక్తపు మడుగులో ఆదిత్య మృతదేహం పడిఉంది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చర్లపల్లి నారాయణనగర్‌కు చెందిన ఆదిత్య  అన్న కూడా ఇదే హాస్టల్‌లో ఉంటున్నాడు. రోజు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి అతని గదికి రాలేదు. దీంతో పక్క గదిలో ఉండోచ్చన ఆదిత్య అన్న భావించారు. మంగళవారం ఉదయం చూసే సరికి ఆదిత్య బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్టల్‌కు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతు కింద కోసి ఉండడంతో ఆదిత్యను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్‌ వార్డెన్‌తో పాటు తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.