రవితేజకు జోడీగా..

Adithirao in raviteja movie

ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన సమ్మోహనంతో తెలుగులో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది బాలీవుడ్ సోయగం అదితీరావు హైదరి. ప్రస్తుతం నాని, సుధీర్‌బాబు కలిసి నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో వుండగానే అదితిరావు హైదరి తెలుగులో మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఆర్‌ఎక్స్ 100తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా తరువాత ఆయన మరో చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ కథానాయకుడిగా నటించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రానికి మహా సముద్రం అనే టైటిల్‌ని చిత్ర బృందం ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా దర్శకుడు అదితీరావు హైదరీని ఖరారు చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలిసింది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రాన్ని ఓ దశలో నాగచైతన్య, ఆ తరువాత నితిన్ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా రవితేజని దర్శకుడు ఫైనల్ చేసుకున్నారు. డిస్కోరాజా పూర్తి కాగానే రవితేజ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారని తెలిసింది.