శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది నయనతార. తాజాగా ఆమె మరోసారి ఈ ఇతిహాస పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. రామాయణం ఆధారంగా త్రీడీ హంగులతో నిర్మాతలు అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెన రామాయణ్ సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో మూడు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి నితీష్ తివారి, రవి ఉద్యావార్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం నయనతారను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. 2021లో తొలిభాగాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.